News January 8, 2026

గ్రేటర్ వరంగల్‌లో 13 నర్సరీల్లో మొక్కల పెంపకం

image

గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రజలకు అవసరమైన మొక్కలు అందించడానికి అధికారులు నర్సరీలో మొక్కల పెంపకం చేస్తున్నారు. 13 నర్సరీల్లో 5 లక్షలకు పైగా మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. మరో 10కి పైగా నర్సరీలను పునరుద్ధరించి మొక్కలు నాటేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో పర్యావరణానికి సంబంధించి, పూలు పండ్లకు సంబంధించిన మొక్కలను ఎక్కువగా పెంచుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 31, 2026

సిట్ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన <<19005122>>నోటీసులపై<<>> హైకోర్టుకు వెళ్లాలని మాజీ సీఎం KCR యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్ నోటీసులను సవాలు చేస్తూ ఈరోజు హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం (FEB 1) మ.3 గంటలకు నంది నగర్ నివాసంలో విచారిస్తామని కేసీఆర్‌కు సిట్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిిందే. ఎర్రవెల్లిలోనే విచారించాలన్న ఆయన అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు.

News January 31, 2026

మేడారంలో నిరుద్యోగుల వినూత్న నిరసన!

image

ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంపై నిరుద్యోగ యువత మేడారం జాతరలో వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. బీటెక్, డిగ్రీ పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా కొలువులు రాకపోవడంతో జీవనోపాధి కోసం జాతరలో చిరు వ్యాపారాలు, షాపులు పెట్టుకున్నామని బ్యానర్లను ప్రదర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ కల్పన చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

News January 31, 2026

రంగారెడ్డి: అత్యాచారం ఘటనలో 25 సంవత్సరాల జైలు

image

బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 25 సంవత్సరాలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ హబీబ్ (53) 2023లో బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో 25 సంవత్సరాలు జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.