News January 8, 2026
GNT: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, ప్రేమ.. నిండు ప్రాణం బలి.!

తెనాలికి చెందిన 9వ తరగతి బాలిక అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించుకోవడం, అతడి ఖర్చులకు తరచూ డబ్బులిస్తుండడం తెలిసిందే. గత నెల 31వ తేదీన న్యూ ఇయర్ వేడుకలకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అతడు టీసీ తీసుకువెళ్తానని చెప్పగా ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం గుంటూరులో మృతి చెందింది. దీంతో పోలీసులు బాలుడిపై పోక్సో కేసును 306 కిందకు మార్చారు.
Similar News
News January 13, 2026
గోదారమ్మ ఒడ్డున సంక్రాంతి ముచ్చట్లు.. మురిపిస్తున్న పల్లెటూరి అందాలు!

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. పచ్చని ప్రకృతి ఒడిలో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. ప్రభల తీర్థాలు, కోడి పందాలు, సంప్రదాయ పిండివంటలతో గోదారోళ్ల ఆతిథ్యం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఆత్మీయ పలకరింపులు, బంధుమిత్రుల సందడితో ఉభయ గోదావరి జిల్లాలు ఇప్పుడు దక్షిణ భారతానికే పండగ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి.
News January 13, 2026
HYD: జైళ్లలో యువతీ, యువకులే ఎక్కువ

తెలంగాణ జైళ్ల యాన్యువల్ రిపోర్టు చూస్తే మతిపోతోంది. సైబర్ క్రైమ్ కేసులు బాంబులా పేలగా, తాగి నడిపి 2,833 మంది లోపలికి వెళ్లారు. మొత్తంగా ఖైదీల సంఖ్య 42 వేలు దాటింది. అందులో Gen Z మెజారిటీ ఉండటం కలవర పెట్టే అంశం. 2025 రిపోర్టు ప్రకారం.. 18,737 మంది యువకులు, 654 మంది యువతులు, 22 ఇతరులు కలిపి 19,413 మంది ఊచలు లెక్కెట్టారు. 2024తో పోలిస్తే నేరాలు చేసిన వారి సంఖ్య 13.31% శాతం పెరగడం గమనార్హం.
News January 13, 2026
WGL: డీసీసీ కమిటీ జాప్యంపై అసంతృప్తి

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఇటీవల డీసీసీ భవన్‌లో ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో
ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అయూబ్‌లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే నియామకం జరిగి 48 రోజులు గడిచినా డీసీసీ పూర్తి స్థాయి కమిటీని ఇంకా ప్రకటించలేదు. కమిటీ జాప్యంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్ష నియామకం జరిగినా కమిటీ ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు.


