News January 8, 2026

అశ్లీల కంటెంట్ వివాదం.. గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!

image

మస్క్ నేతృత్వంలోని Xకు కేంద్ర IT శాఖ మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. Grok AI ద్వారా అశ్లీల చిత్రాలను సృష్టిస్తున్న ఉదంతంపై X సమర్పించిన నివేదిక సరిపోదని చెప్పింది. ఈ అశ్లీల కంటెంట్‌పై తీసుకున్న నిర్దిష్ట చర్యలు, భవిష్యత్తులో జరగకుండా చేపట్టే నివారణా మార్గాల గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. భారత చట్టాలను గౌరవిస్తామని X చెబుతున్నా కచ్చితమైన వివరాలు సమర్పించాల్సిందేనని కేంద్రం ఆదేశించింది.

Similar News

News February 13, 2026

ఆటిజం‌కు చికిత్స ఇదే..

image

ప్రపంచంలోని ప్రతి 68 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం అంటారు. దీనికి చికిత్స లేదు కానీ చిన్న వయసునుంచే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల మార్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఉంటాయి. వీటితో పాటు తల్లిదండ్రులే శిక్షకులుగా మారాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 13, 2026

రాహుల్‌పై నోటీసు… స్పీకర్ నిర్ణయంపై ఆసక్తి

image

రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని BJP MP నిశికాంత్ దూబే సబ్‌స్టాంటివ్ మోషన్ నోటీసు ఇవ్వడం తెలిసిందే. దీనిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. దీన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించడంపై స్పీకర్ నిర్ణయించాలి. అది విచారించి ఇచ్చిన సిఫార్సును సభ ఆమోదానికి పెట్టాలి. సభ సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చర్య చేపడతారు. గతంలో మొహువా మొయిత్రా (TMC MP)ని ఎథిక్స్ కమిటీ సిఫార్సుతో బహిష్కరించారు.

News February 13, 2026

మార్కెట్ల పతనం.. ₹7 లక్షల కోట్లు ఉఫ్!

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బేర్ గుప్పిట్లో చిక్కుకొని విలవిల్లాడాయి. సెన్సెక్స్ 1,048 Pts కుంగి 82,626 వద్ద, నిఫ్టీ 336 Pts క్షీణించి 25,471 దగ్గర స్థిరపడ్డాయి. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, SBI మాత్రమే లాభపడ్డాయి. HUL, ఎటర్నల్, TATA స్టీల్, టైటాన్ భారీగా నష్టపోయాయి. దాదాపు ₹7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఐటీ స్టాక్స్ డౌన్‌ఫాల్ మార్కెట్ల పతనాన్ని శాసించింది.