News January 8, 2026
మున్సిపల్ ఎన్నికలకు BRS స్పెషల్ మ్యానిఫెస్టో

TG: ‘సర్పంచ్’ ఫలితాల జోష్‌తో మున్సిపల్ ఎన్నికలకు BRS సిద్ధమవుతోంది. 117 మున్సిపాలిటీల్లో రాజకీయ ఎజెండాను నిర్ణయించడానికి KTR వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో స్థానిక సమస్యలను గుర్తించాలని నాయకులకు సూచించారు. నోటిఫికేషన్ జారీ తర్వాత ఉమ్మడి లేదా మున్సిపాలిటీల వారీగా మ్యానిఫెస్టోను ఖరారు చేస్తారు. కేసీఆర్, రేవంత్ పాలనలో తేడాను ప్రత్యేకంగా హైలైట్ చేయనున్నారు.
Similar News
News February 25, 2026
నక్కపల్లి: ఈ తాజమహల్‌కు లిమ్కా బుక్‌లో చోటు

సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ మరో అరుదైన ఘనత సాధించారు. 2026 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకు చోటు లభించింది. 4బీ పెన్సిల్ ముల్లుపై కేవలం 4 మి.మీ వెడల్పు, పొడవుతో అతి సూక్ష్మమైన తాజ్‌మహల్‌ను 6 గంటల పాటు శ్రమించి రూపొందించారు. నక్కపల్లి మండటం చినదొడ్డిగల్లుకు చెందిన వెంకటేశ్‌కు సంబంధించిన రికార్డు పత్రాన్ని మంగళవారం పోస్టల్ ద్వారా పంపారు.
News February 25, 2026
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 25)

* 1961-తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మరణం * 1974-సినీ నటి దివ్యభారతి జననం(ఫొటోలో) * 1981-బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పుట్టినరోజు * 1998-ఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానాన్ని ఆల్ ఇండియా రేడియో(ఆకాశవాణి) ప్రవేశపెట్టింది * 2004-సినీ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి మరణం * 2010-స్వాతంత్ర్య సమరయోధుడు కాటం లక్ష్మీనారాయణ మరణం * 1973- డైరెక్టర్ గౌతమ్ మేనన్ పుట్టినరోజు
News February 25, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


