News January 8, 2026
కార్పొరేషన్‌పై ఎమ్మెల్సీ సారయ్య అలక..!

మొన్నటి వరకు వరంగల్ పోలీసులపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య.. ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్‌పై ఫైర్ అవుతున్నారు. తమను కార్పొరేషన్ సమావేశానికి మాత్రమే పిలుస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలకు పిలువడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 8, 2026
పాపికొండల పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి

జిల్లాలో మంజూరైన రోడ్లను మే నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి మనోహర్ శనివారం అధికారులను ఆదేశించారు. దెందులూరులో 150 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధమైందని వెల్లడించారు. పాపికొండల పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ రిసార్టులు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే 50 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరో 60 యూనిట్లు రానున్నాయని తెలిపారు.
News February 8, 2026
శేష వాహన సేవలో మన్యంకొండ శ్రీవారు

మన్యంకొండ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత విశేషమైన శేష వాహన సేవ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రాత్రి 9 గంటల తర్వాత ఆదిశేషునిపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శేష వాహన సేవను దర్శించడం వల్ల పాపాలు తొలగి, కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
News February 8, 2026
ఉద్యాన పంటలతో రూ.7,693 కోట్ల ఆదాయం: మంత్రి మనోహర్

జిల్లాలో 3,24,500 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు జరుగుతోందని మంత్రి మనోహర్ తెలిపారు. ఏలూరులో శనివారం ఆయన మాట్లాడారు. గతేడాది ఈ పంటల ద్వారా రూ.7,693 కోట్ల ఆదాయం లభించిందని వెల్లడించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ అందిస్తున్నామని, సాంకేతిక కారణాలతో ఆగిన మిగిలిన 267 కుటుంబాలకు త్వరలోనే చెల్లింపులు పూర్తి చేస్తామని వివరించారు.


