News January 8, 2026
రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.
Similar News
News February 25, 2026
డెల్టా రైతులకు గుడ్ న్యూస్.. మీ ఉత్పత్తులకు మార్కెట్ సిద్ధం!

ప్రకృతి వ్యవసాయంపై కొనుగోలుదారులు, విక్రేతల అనుసంధాన సమావేశం రాజమండ్రిలో బుధవారం ఘనంగా జరిగింది. తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మార్గదర్శకత్వంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డెల్టా ప్రాంత రైతులు, ప్రాసెసర్లు, రిటైలర్లు పరస్పరం అనుసంధానమవడానికి ఈ సమావేశం చక్కని వేదికగా నిలిచింది. ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్, విక్రయాల పెంపునకు పలువురు కీలక సూచనలు చేశారు.
News February 25, 2026
గోకవరం: ఏడో తరగతి బాలికను వేధించిన యువకుడి అరెస్ట్

గోకవరం మండలంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికను వేధించిన కాళ్ల రాకేశ్ అనే యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు నిత్యం వేధిస్తున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో గోకవరం SI పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడిని రాజంమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచినట్లు SI తెలిపారు.
News February 24, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఏడుగురి పరిస్థితి విషమం

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండియన్ మంగళవారం కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించగా, మరో 15 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కొందరిని వెంటిలేటర్, డయాలసిస్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.


