News January 8, 2026
విశాఖ: సంక్రాంతి తర్వాత.. మరో 3 రోజులు పండగే!

విశాఖ వేదికగా తారల క్రికెట్ పండగకు రంగం సిద్ధమైంది. ACA-VDCA స్టేడియంలో జనవరి 16, 17, 18 తేదీల్లో CCL 2026 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 16న మధ్యాహ్నం 2 గంటలకు పంజాబ్ vs కర్ణాటక, సాయంత్రం 6:30కు మన తెలుగు వారియర్స్ vs భోజ్‌పురి దబాంగ్స్ తలపడతాయి. 17, 18 తేదీల్లో ముంబై, బెంగాల్, చెన్నై జట్లు ఆడే మ్యాచ్‌లతో ఈ వారాంతం విశాఖలో సందడి నెలకొననుంది.
Similar News
News February 12, 2026
కామారెడ్డి: రేపే ఫలితాల వెల్లడి.. అభ్యర్థుల్లో ‘లబ్ డబ్’

కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల భవితవ్యం తేలే గడియలు దగ్గరపడ్డాయి. శుక్రవారం ఉదయం నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఫలితాల ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP అభ్యర్థులతో పాటు స్వతంత్రులకు కూడా ఈ రాత్రి నిద్రలేకుండా పోయింది. గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ, ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ‘లబ్ డబ్’ అభ్యర్థుల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
News February 12, 2026
పెద్దపల్లి: ‘సమాజంలోని హింసపై మహిళలు ఉద్యమించాలి’

సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను రూపుమాపడానికి స్వశక్తి సంఘాల మహిళలు ఉద్యమించాలని సెర్ప్ రాష్ట్ర జెండర్ డైరెక్టర్ జమున పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల సోషల్ యాక్షన్ కమిటీ సభ్యుల శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చట్టాలపై అవగాహన, కమిటీల నిర్మాణం, జెండర్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News February 12, 2026
నల్గొండ: వృద్ధురాలిపై యువకుడి లైంగిక దాడి

మర్రిగూడ మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై 23 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మర్రిగూడ ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.


