News January 8, 2026
IPAC ఆఫీసుపై ED దాడులు

కోల్‌కతా సాల్ట్ లేక్‌లోని IPAC ఆఫీసు, సంస్థ కో ఫౌండర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ED దాడులు చేస్తోంది. కోల్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కేసులో TMC జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీని ED, CBI అధికారులు పలుమార్లు విచారించారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి IPAC, TMC కలిసి పనిచేస్తున్నాయి. కొన్ని నెలల్లో WBలో ఎన్నికలు జరగనున్నందున రైడ్స్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
Similar News
News January 25, 2026
టీమ్ ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించింది. సంజూ డకౌటైనా అభిషేక్(68*), సూర్యకుమార్(57*) ధాటిగా ఆడారు. పవర్ ప్లే ముగిసేలోపే అభిషేక్ ఫిఫ్టీ నమోదు చేశారు. ఇషాన్(28) సైతం ధనాధన్ ఇన్నింగ్సు ఆడారు. ఈ విజయంతో 5 T20Iల సిరీస్‌ను 3-0తో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. మరో 2 టీ20లు నామమాత్రం కానున్నాయి.
News January 25, 2026
అభిషేక్ శర్మ ఊచకోత..

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నారు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. భారత్ తరఫున టీ20లలో ఇదే సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. తొలి స్థానంలో అభిషేక్ గురువు యువరాజ్(12 బంతుల్లోనే అర్ధ సెంచరీ) ఉన్నారు.
News January 25, 2026
చెప్పింది 3 వేలు.. అసలు లెక్క 30 వేలు!

ఇరాన్ నిరసనల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి 8, 9వ తేదీల్లోనే దాదాపు 30 వేల మంది మృతి చెందినట్లు USకు చెందిన TIME మ్యాగజైన్ వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించిన 3,117 మరణాల కంటే హాస్పిటల్ రికార్డులు, స్థానిక అధికారులు, వైద్యులు తెలిపిన సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. సుమారు 4,000 ప్రాంతాల్లో నిరసనలు జరగగా ఇంటర్నెట్ ఆపేయడం వలన వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియలేదని పేర్కొంది.


