News January 8, 2026
అందోల్: ఆరోగ్యశ్రీ ఉద్యోగి సూసైడ్

అందోల్ మండలం సంగుపేట గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో కమ్మరి రవీందర్(39) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. రవీందర్ 12 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రవీందర్ మరణంతో భార్య, కుమారుడు అనాథలయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 20, 2026
TGRSA కరీంనగర్ డైరీని ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కరీంనగర్ డైరీని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ఉద్యోగులు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. శాఖ చరిత్ర, ముఖ్య సమాచారం, ఉపయోగకరమైన వివరాలతో డైరీని రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, జిల్లా రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.
News February 20, 2026
రేపు వేంకటేశ్వరుడి ఆలయాల్లో కూటమి శ్రేణుల పూజలు

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇవాళ మండలికి YCP నేతలు శ్రీవారి ఫొటోలను తేవడంపై కూటమి నేతలు తీవ్రంగా పరిగణించారు. దేవుడికి అపచారం జరిగిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని జూమ్ కాన్ఫరెన్సులో నిర్ణయించారు. రేపు వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో పూజలతో పాటు సంప్రోక్షణ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అటు మఠాధిపతులు, స్వామీజీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
News February 20, 2026
కరీంనగర్: మైనార్టీల కోసం ప్రత్యేక పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రెండు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించిందని జిల్లా మైనారిటీ అధికారి వి.జగదీశ్వర్ తెలిపారు. tgobmms పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ. 1.50లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 1.20 లక్షల సబ్సిడీ, ముస్లిం బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారికి రూ. 60వేల యూనిట్ విలువతో పథకం అమలు చేస్తున్నామన్నారు. కలెక్టరేట్ లోని 108 రూంలో సంప్రదించాలన్నారు.


