News January 8, 2026
శ్రీ సత్యసాయి జిల్లాలో 68 ఉద్యోగాలకు నోటిఫికేషన్

శ్రీ సత్యసాయి జిల్లాలోని KGBVల్లో 68 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 21, టైప్-4 కేజీబీవీల్లో 47 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.
Similar News
News February 10, 2026
క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు: కలెక్టర్

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం క్యాబ్ బుకింగ్ విధానంలోనే వ్యవసాయానికి డ్రోన్ సేవలను కూడా సులభంగా బుక్కు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులు, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఏలూరులో కలెక్టర్ ఆవిష్కరించారు.
News February 10, 2026
మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 106 వార్డులు ఉండగా 1,85,348 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు 1,34,775 మంది, అశ్వారావుపేట 22 వార్డులు 16,850 మంది, ఇల్లందు 24 వార్డులు 33,723 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.
News February 10, 2026
రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపవాసాల నేపథ్యంలో ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈనెల 18 నుంచి మార్చి 19 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు డ్యూటీ నుంచి ఒక గంట ముందే ఇంటికి వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.


