News January 8, 2026

సంక్రాంతికి ఊర్లు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ

image

సంక్రాంతి సందర్భంగా ఊర్లు వెళ్లేవారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. నగదు ఇంట్లో ఉంచవద్దన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఊర్లకు వెళ్లేవారు సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.

Similar News

News February 20, 2026

ఎన్టీఆర్ జిల్లాలో TODAY TOP NEWS

image

* విజయవాడలో దారుణం కూతురిపట్ల తండ్రి అసభ్య ప్రవర్తన
* విస్సన్నపేటలో కారు బీభత్సం.. పట్టుకున్న స్థానికులు
* ఇబ్రహీంపట్నంలో ఆధార్ అప్డేట్ కోసం తప్పని తిప్పలు
* వత్సవాయిలో హోలీ పేరుతో మామూలు వసూళ్లు
* విజయవాడలో ప్రమాదం.. ఒకరి మృతి
* చంద్రబాబును జైళ్లో వేయాలి: పేర్ని నాని
* ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ అన్నదానానికి రూ.5 లక్షల విరాళం!
* జగ్గయ్యపేట: జగన్ పర్యటనలో మృతి చెందిన కార్యకర్త ఫ్యామిలీకి సాయం

News February 20, 2026

రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

image

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆసుపత్రిలోని నిర్మాణ పనులు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాల పనితీరును ఆయన పరిశీలించారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని, వైద్య సేవల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

News February 20, 2026

HYD: TG EAPCETకి 10,924 దరఖాస్తులు

image

TG EAPCET ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాలకు సంబంధించి 4,111 మంది విద్యార్థులు నేడు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి 6,800 మంది అప్లై చేయగా 2 విభాగాలకు 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 10,924 అప్లికేషన్ వచ్చాయని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.