News January 8, 2026
‘సూర్యాపేట జిల్లాలో 10 వేల టన్నుల యూరియా నిల్వలు’

జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం 10 వేల టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గురువారం కోదాడ మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, ముందస్తుగానే అవసరమైన మేర యూరియా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 6, 2026
బంగ్లాలో ఘర్షణలు.. యూనస్ ఇంటి బయటే..!

ఎన్నికలకు 6 రోజుల ముందు బంగ్లాలో ఘర్షణలు చెలరేగాయి. దేశ సలహాదారు యూనస్ నివాసం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నేషనల్ పే స్కేల్ అమలు చేయాలని దేశంలోని ఉద్యోగులు ఢాకాలోని షహీద్ మినార్ నుంచి యూనస్ నివాసానికి ర్యాలీగా వచ్చారు. లోనికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఢాకా అంతటా భారీగా బలగాలను మోహరించారు.
News February 6, 2026
నిజాంసాగర్: 31 కిలోల చేప లభ్యం

నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్‌కు చెందిన మత్స్యకారుడు ఫణికి నిజాంసాగర్ జలాశయంలో శుక్రవారం చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన వలకు ఏకంగా 31 కిలోల బరువైన భారీ బొచ్చ చేప చిక్కింది. ఇంత భారీ చేప దొరకడం చాలా అరుదైన విషయమని మత్స్యకారులు తెలిపారు. ఈ చేపను సమీపంలోని బొగ్గు గుడిసె వద్ద రూ.5,800లకు విక్రయించినట్లు చెప్పారు. భారీ చేప లభించడంతో ఫణితో పాటు గ్రామంలోని మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమైంది.
News February 6, 2026
వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం

వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. వేములవాడలో ఎన్నికల జోనల్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె సందర్శించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎస్‌ఈసీ కరదీపిక వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికల విధులలో ఉండే అధికారులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలన్నారు.


