News January 8, 2026

PDPL: విశ్వబ్రాహ్మణుల సమస్యలపై సీఎం దృష్టికి వినతి

image

పెద్దపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి అక్రమ రికవరీలు, బంగారం ధరల పెరుగుదలతో స్వర్ణకారుల ఉపాధి సమస్యలను వివరించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ లభించింది.

Similar News

News January 28, 2026

న్యాయస్థానంలో జాబ్స్ దరఖాస్తు పొడిగింపు: జిల్లా జడ్జి

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు జిల్లా జడ్జి శ్రీదేవి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలని సూచించారు. ఈ పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

News January 28, 2026

మా విమానం 100 శాతం సేఫ్: VSR వెంచర్స్

image

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ <<18980385>>చనిపోయిన<<>> ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్ VSR వెంచర్స్ స్పందించింది. తమ విమానం 100 శాతం సురక్షితమని ప్రకటించింది. సిబ్బందికి చాలా అనుభవం ఉందని తెలిపింది. పూర్ విజిబిలిటీ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని సంస్థ అధికారి విజయ్ కుమార్ సింగ్ చెప్పారు. మరణించిన పైలట్లు సుమిత్ కపూర్, శాంభవి పాఠక్‌ అని పేర్కొన్నారు. ఇది తమ కంపెనీకి కష్ట సమయమని అన్నారు.

News January 28, 2026

ములుగు: నేటినుంచి లక్నవరం సందర్శన బంద్

image

మేడారం మహా జాతర సందర్భంగా గోవిందరావుపేట మండలం లక్నవరం పర్యాటక ప్రాంతానికి సందర్శన నిలిపివేస్తున్నట్లు పస్రా ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఆదేశాల మేరకు నేటి నుంచి సందర్శన ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు, పర్యటకులు గమనించి, పోలీసులకు సహకరించాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.