News January 8, 2026

ప్రెగ్నెన్సీలో కాళ్లు వాపు వస్తున్నాయా?

image

ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు రావడాన్ని వైద్య పరిభాషలో జెస్టెషనల్‌ ఎడిమా అంటారు. గర్భిణిలలో ఏడో నెల నుంచి కాళ్లవాపు సాధారణంగా కనిపిస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు కాళ్లలో వాపు వస్తుంది. ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు వేసుకున్నపుడు కూడా కొన్నిసార్లు కాళ్లవాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Similar News

News February 23, 2026

కల్తీ పాల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: జగన్

image

AP: రాజమండ్రి కల్తీ పాల <<19213441>>ఘటనపై<<>> మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని జగన్ పేర్కొన్నారు. కాగా కల్తీ పాల ఘటనపై CM చంద్రబాబు ఇప్పటికే కఠిన <<19215266>>చర్యలకు<<>> ఆదేశించారు.

News February 23, 2026

మొలతాడు గురించి మీకు ఈ కథ తెలుసా?

image

మొలతాడుధారణ వెనుక ఓ పురాణ కథ ఉంది. కృష్ణుడి వరంతో ఉదంక మహర్షికి అమృతం ఇవ్వడానికి ఇంద్రుడు చండాలుడి రూపంలో వచ్చాడు. అమృత భాండాన్ని తన నాభి దిగువన మొలతాడుకు కట్టుకుని తెచ్చాడు. నాభి కింద భాగం అపవిత్రమని భావించిన రుషి దానిని నిరాకరించాడు. ఈ ఘటన ద్వారా శరీరాన్ని ఊర్థ్వ, అథో భాగాలుగా విభజించే సూచీ రేఖగా మొలతాడు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది క్రమశిక్షణకు, పవిత్రతకు చిహ్నంగా మారింది.

News February 23, 2026

APPLY NOW: ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

<>ఇండియన్<<>> బ్యాంక్, చెన్నై హెడ్ క్వార్టర్స్‌లో 7 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనుంది. ఇంటర్ అర్హతతో పాటు అంతర్జాతీయ, జాతీయ, యూనివర్సిటీ, ఖేలో ఇండియా స్థాయి క్రీడల్లో పాల్గొని మెడల్స్ సాధించినవారు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 26ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ గలవారికి సడలింపు). స్క్రీనింగ్ అప్లికేషన్స్ /ట్రయల్స్/ఇంటర్వ్యూ/మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: indianbank.bank.in