News January 8, 2026
బంగ్లాదేశ్‌లో హిందువు హత్య.. ప్రధాన నిందితుడు అరెస్టు

బంగ్లాదేశ్‌లో సంచలనం రేపిన హిందువు <<18624742>>దీపూ దాస్ హత్య<<>> కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ టీచర్ యాసిన్ అరాఫత్‌ను ఇవాళ పట్టుకున్నారు. ‘దీపూ దాస్‌పై దాడికి ప్లానింగ్, అమలులో ఇతడు కీలకపాత్ర పోషించాడు. గుంపును ఎగదోయడం మాత్రమే కాదు.. దీపూను స్వయంగా కూడలిలోకి లాక్కెళ్లాడు. ఇన్నిరోజులు పరారీలో ఉన్నాడు’ అని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు.
Similar News
News February 24, 2026
ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్

TG: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1.2 కోట్ల పరిహారం ఇవ్వనుంది. 60 ఏళ్లలోపు సహజ మరణానికి ₹10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. 7.57 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తించనుంది. క్యాష్‌లెస్ EHS అమలు చేయాలని నిర్ణయించింది.
News February 24, 2026
మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ!

తెలంగాణ మావోయిస్ట్ క్యాడర్ DGP శివధర్ రెడ్డి సమక్షంలో రేపు లొంగిపోనున్నట్లు సమాచారం. కీలక నేతలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లారాజిరెడ్డి, చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి అస్త్ర సన్యాసం చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో 15 మంది లొంగిపోనున్నారట. దీంతో TG మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారుతుందని పోలీసులు చెబుతున్నారు. రేపు దీనిపై DGP అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు.
News February 23, 2026
TGPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

TG: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునే గడువును మార్చి 25కు పొడిగిస్తున్నట్లు TGPSC ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ <


