News January 8, 2026
పెద్దపల్లి: విధుల్లో నిర్లక్ష్యం.. రికార్డు అసిస్టెంట్ సస్పెన్షన్

పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రికార్డు అసిస్టెంట్ పి.లక్ష్మణ్‌ను విధులలో నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం, సమయపాలన పాటించకపోవడం వంటి అంశాలపై పలు మార్లు మెమోలు, షోకాజ్ నోటీసులు ఇచ్చినా మార్పు రాకపోవడంతో కఠిన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్

పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. గురువారం రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్లతో నిర్వహించిన శిక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రౌండ్ ఫలితాలను ఎప్పటికప్పుడు సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల మేరకు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడాలని సూచించారు.
News February 12, 2026
ADB: విమానాశ్రయం అభివృద్ధికి అదనంగా 249.82 ఎకరాలు

ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధికి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడికి సమాచారం ఇచ్చారు. జిల్లా అధికారులు కూడా అవసరమైన అదనపు భూములను సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించింది.
News February 12, 2026
తిరుపతి: ‘వ్యభిచారం ఆరోపణలు అవాస్తవం’

రెండేళ్లుగా తన కుమార్తెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ ఎక్కడో దాచారని రేణిగుంటకు చెందిన ఓ మహిళ ఆరోపించిన వీడియో వైరలైంది. దీనిపై గాజులమండ్యం సీఐ స్పందించారు. ‘రేణిగుంటలోని ఓ కంపెనీలో ఆమె కుమార్తె పనిచేసేది. తన తల్లికి మానసిక సమస్య సరిగా లేక తరచూ కంపెనీకి వెళ్లి గొడవ పడేది. దీంతో కుమార్తె ఇక్కడ జాబ్ మానేసి బెంగళూరుకు వెళ్లి జాబ్ చేసుకుంటోంది. తల్లి ఆరోపణలు నిరాధారం’ అని సీఐ చెప్పారు.


