News January 8, 2026

HT పత్తి విత్తనాలు కొనొద్దు: మంత్రి తుమ్మల

image

TG: HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఫీల్డ్ ట్రయల్స్‌లో ఫెయిలైనందున కేంద్రం ఆ కంపెనీ విత్తనాల అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. అధిక దిగుబడి వస్తుందనే ఆశతో రైతులు HT పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని కోరారు. పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కో-మార్కెటింగ్‌కు విధివిధానాలు రూపొందించాలన్నారు.

Similar News

News February 5, 2026

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.5,020 తగ్గి రూ.1,54,420కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,600 పడిపోయి రూ.1,41,550 పలుకుతోంది.

News February 5, 2026

హిందీ మాత్రమే నేర్చుకుంటే పానీపూరీ అమ్ముకోవాల్సిందే: మంత్రి

image

హిందీ వివాదం వేళ తమిళనాడు మంత్రి MRK పన్నీర్‌సెల్వం షాకింగ్ కామెంట్లు చేశారు. ఉత్తరాది ప్రజలు కేవలం హిందీ నేర్చుకోవడం వల్ల వారు తమిళనాడులో పానీపూరీ సెల్లర్లు, నిర్మాణ కార్మికులు, టేబుల్ క్లీన్ చేసేవారిగా స్థిరపడుతున్నారని ఎద్దేవా చేశారు. తమిళియన్లు మాతృభాషతోపాటు ఇంగ్లిష్ నేర్చుకుని US, UKలో ఉద్యోగాలు సాధించి రూ.కోట్లు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.

News February 5, 2026

శంషాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైలు కారిడార్లు: కిషన్ రెడ్డి

image

HYD హైస్పీడ్ రైల్ హబ్‌గా మారబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘TGలో రైల్వే మౌలిక సదుపాయాలకు బడ్జెట్‌లో ₹5,454Cr కేటాయించాం. శంషాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైలు కారిడార్లు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా HYD-BLR, CHE-PUNE జర్నీకి 3hrs కంటే తక్కువ సమయం పట్టనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ₹47,984Cr విలువైన ప్రాజెక్టులు కొనసాగుతుండగా, 100% రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయింది’ అని పేర్కొన్నారు.