News April 25, 2024

నిర్మల్: పరారీలో ఉన్న హోంగార్డ్‌ అరెస్ట్

image

అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడి పరారీలో ఉన్న హోమ్ గార్డ్ షమీముల్లా ఖాన్ (షకీల్)ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పలువురిని మోసగించినట్లు సీఐ అనిల్ తెలిపారు. పరారీలో ఉన్న అతణ్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల, డీఎస్పీ గంగారెడ్డి పోలీసులను అభినందించారు.

Similar News

News March 15, 2026

ADB: కుప్ప కూలిన టెంట్.. తప్పిన ప్రమాదం

image

జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన హీరా సుకా జయంతి వేడుకల సందర్భంగా భోజనం కోసం ఏర్పాటు చేసిన టెంటు గాలికి కుప్ప కూలింది. ఆ సమయంలో భోజనాలు ప్రారంభం కాకుండా ఆ టెంటు కింద కొంత మంది మాత్రమే ఉండడంతో ప్రమాదం తప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే చిన్నపాటి గాలికి టెంటు కుప్ప కూలిందని ఆదివాసీ పర్ధాన్‌ వాపోయారు.

News March 14, 2026

పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.

News March 14, 2026

థర్డ్ పార్టీ అప్లికేషన్లపై అప్రమత్తంగా ఉండాలి: ADB SP

image

తెలియని థర్డ్ పార్టీ అప్లికేషన్లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. వీటి ద్వారా డాటా చోరీ, మొబైల్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఈ వారం 14 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.