News January 8, 2026
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

77వ భారత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేలా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మార్కాపురంలో సైతం ఘనంగా వేడుకలు నిర్వహించాలని కోరారు.
Similar News
News January 25, 2026
ప్రకాశం: వీటి విషయంలో జాగ్రత్త.!

ఏ ఉత్సవానికైనా పటాకుల పేలుళ్లు కచ్చితంగా మారాయి. అయితే వాటి విషయంలో కొంతమంది వహిస్తున్న నిర్లక్ష్యంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల కడపలో జరిగిన శోభాయాత్రలో సెక్యూరిటీ గార్డ్ <<18946125>>హరి శంకర ప్రసాద్(52)<<>> పటాకులు తన శరీరంపై పేలడంతో చనిపోయారు. అయితే పటాకులు పేలుస్తున్న వారి నిర్లక్ష్యం వల్ల వాటికి దూరంగా ఉన్న హరి దగ్గరకు అవి వచ్చి పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. అందుకే ‘సోదరా పటాకుతో జాగ్రత్త’గా ఉండండి.
News January 24, 2026
పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. శనివారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో ప్రకాశం, మార్కాపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో కలెక్టర్ మాట్లాడారు. చీమకుర్తి, దర్శి, పొదిలి ప్రాంతాలలో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News January 24, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ‘ఎస్పీ మీకోసం’ కార్యక్రమం రద్దు: SP

జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు, ఆయా జిల్లాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


