News January 8, 2026
ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్.. సీఎం సమీక్ష

TG: సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని రివ్యూ మీటింగ్‌లో సూచించారు. ‘సోలార్ కిచెన్‌ల ఏర్పాటును పరిశీలించాలి. యంగ్ ఇండియా స్కూళ్ల పనుల్ని వేగవంతం చేయాలి. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని చెప్పారు.
Similar News
News February 22, 2026
సభలోకి దేవుళ్ల ఫొటోలు ఎందుకు తీసుకెళ్లొద్దు?: భూమన

AP: దేవాలయాల్లాంటి అసెంబ్లీ, మండలిలోకి దేవుళ్ల ఫొటోలు ఎందుకు తీసుకెళ్లకూడదని TTD మాజీ ఛైర్మన్, YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నోసార్లు బూట్లు ధరించే దేవుడి ఫొటోలను పలువురికి కానుకగా ఇచ్చారని ఆరోపించారు. కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని అన్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలోకి శ్రీవారి ఫొటోలు తీసుకురావడంపై కూటమి నేతలు మండిపడిన సంగతి తెలిసిందే.
News February 22, 2026
ఓవర్సీస్ విద్యానిధి పథకం.. రేపటి నుంచి దరఖాస్తులు

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి (₹20L వరకు సాయం) పథకానికి దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు మార్చి 24 వరకు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 300 నుంచి 700కి పెంచింది. ఇందులో BCలకు 500, EBCలకు 200 చొప్పున కేటాయించారు. దరఖాస్తు, పూర్తి వివరాలకు <
News February 22, 2026
కనకాంబరం సాగుకు అనువైన రకాలు

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.


