News January 8, 2026

జనగామలో విద్యాశాఖపై జిల్లా స్థాయి సమావేశం

image

జనగామ ఐడీఓసీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, జిల్లా విద్యా శాఖ అధికారి పింకేష్ కుమార్, హైదరాబాద్ SIET జాయింట్ డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి ఆధ్వర్యంలో విద్యాశాఖ జిల్లా స్థాయి సమావేశంతో పాటు పీఎం శ్రీ పాఠశాలల నిధుల వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గత నెలతో పోలిస్తే జిల్లా పురోగతి సాధించిందన్నారు. కానీ ఇంకా ముందుకు సాగాలని సూచించారు.

Similar News

News February 14, 2026

NLG: మున్సిపల్ ఎన్నికల్లో వాడిపోయిన కమలం

image

ఉమ్మడి NLG జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కార్యకర్తలు ఆశించిన విజయం దక్కించుకోలేకపోయారు. యాదాద్రి జిల్లాలో 12 వార్డుల్లో BNG 4, CPL 3, గుట్ట 2, ఆలేరు 2, పోచంపల్లి 1, MLG, DVKలో ఒక్కో వార్డు మాత్రమే, SRPTలో కేవలం 1 సీటు మాత్రమే దక్కించుకున్నారు. మొత్తంగా జిల్లాల వారీగా 15 వార్డులు, NLG కార్పొరేషన్లో 4 డివిజన్లో మాత్రమే దక్కాయి.

News February 14, 2026

వరంగల్: హస్తం దెబ్బకు గులాబీ విలవిల!

image

BRSకు కంచుకోట అని చెప్పుకునే వరంగల్‌‌‌లో హస్తం దెబ్బతో ఆ పార్టీ కనుమరుగుకు దగ్గరైపోయింది. NSPTలో ‘పెద్ద’మాటలకు దొంతి హస్తంతో చెంపపెట్టు పెట్టారు. పరకాలలో ‘చల్ల’గా రే‘ఊరి’ వేశాడు. ములుగులో ‘బడా’కు సీ‘తొక్క’ తీశారు. డోర్నకల్, మరిపెడలో ఉద్దండుడికి ‘రెడ్’ సిగ్నల్ ఇచ్చారు. మానుకోటలో ‘మురళీ’గానంతో ‘శంకర’గిరి మాన్యాలకు పంపారు. BHPLలో ‘గండ్ర’ గొడ్డలితో వేటేశారు. ఘన్‌పూర్లో తాటికొండకు కడియం‘తౌటం’ పెట్టారు.

News February 14, 2026

మెదక్: ఈనెల 22న టీజీ సెట్ ప్రవేశ పరీక్ష

image

గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఈ నెల 22న <>టీజీ సెట్<<>> ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మెదక్ డీసీఓ అనురాధ తెలిపారు. 5వ తరగతి ప్రవేశాలతో పాటు, 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఈ పరీక్ష జరగనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని, పరీక్షా కేంద్రానికి హాల్‌టికెట్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ తీసుకురావాలని సూచించారు.