News January 8, 2026
WNP: బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడిగా మన్మోహన్ రావు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వనపర్తికి చెందిన ప్రముఖ న్యాయవాది పి.మన్మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పి.వెంకట్రాంరెడ్డి ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా బాల్ బ్యాట్మెంటిన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, పరిశీలకుడిగా సుమన్ హాజరయ్యారు. డిప్యూటీ ఎస్ ఓ.సుధీర్ రెడ్డి, క్రీడాకారులు భాస్కర్ గౌడ్,అలీమ్, చుక్క చంద్ర శేఖర్, నరేందర్ పాల్గొన్నారు.
Similar News
News February 5, 2026
తిరుపతి: మిషన్ స్వర్ణ సర్వే పూర్తి..!

స్వర్ణముఖి నదీ పరిరక్షణ కోసం తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి చేపట్టిన మిషన్ స్వర్ణ (ఆపరేషన్ స్వర్ణ) కార్యక్రమం సర్వే పూర్తయింది. నదీ పరివాహక ప్రాంతం ఆక్రమణలు చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంటలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తుడా బోర్డు సమావేశంలో సరిహద్దులు గుర్తించి రాళ్లు పాతడానికి తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభం కానున్నాయి.
News February 5, 2026
మల్లె సాగు – అనువైన రకాలు

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.
News February 5, 2026
కానుగ నీడ, కన్నతల్లి నీడ

ప్రకృతిలో లభించే నీడలలో కానుగ చెట్టు నీడ అత్యంత చల్లనిదిగా పరిగణించబడుతుంది. ఇతర చెట్ల కంటే దీని ఆకులు దట్టంగా ఉండి, ఎండను అసలు చొరబడనీయకుండా ఉంటాయి. అందుకే ఈ చెట్టు కింద సేద తీరితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక బిడ్డకు తన కన్నతల్లి ఒడి ఎంతటి భద్రతను, చల్లదనాన్ని, ఓదార్పును ఇస్తుందో.. ఎండలో అలసిపోయిన బాటసారికి కానుగ చెట్టు నీడ అంతటి ఉపశమనాన్ని ఇస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.


