News April 25, 2024
నెల్లూరులో ప్రచారానికి బాలయ్య రాక

టీడీపీకి మద్దతుగా హీరో బాలకృష్ణ ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన తొలివిడత స్వర్ణాంధ్ర సాకార యాత్ర పూర్తి అయ్యింది. రెండో విడతలో భాగంగా ఈనెల 26న నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కందుకూరులో సభ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. రూరల్, సిటీ నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు.
Similar News
News November 6, 2025
మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.
News November 6, 2025
నెల్లూరు యువకుడిని మోసం చేసిన యువతులు

నెల్లూరు సిటీకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా పూర్వ, లావణ్య పరిచయమయ్యారు. పూర్వ ఆన్లైన్ ట్రేడింగ్‌లో రూ.2లక్షలు పెట్టించింది. లావణ్య సైతం ట్రేడింగ్‌లో పలుదఫాలుగా రూ.10లక్షలు ఇన్వెస్ట్ చేయించింది. ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి రూ.54వేలు కట్టాలని లావణ్య కోరింది. మోసపోయానని గ్రహించిన యువకుడు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News November 6, 2025
నెల్లూరు జిల్లా విభజన ఇలా..!

మరోసారి నెల్లూరు జిల్లా విభజన జరగనుంది. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరు నెల్లూరులోకి రానుంది. విడవలూరు, కొడవలూరును కావలి నుంచి నెల్లూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. కలువాయి, రాపూరు, సైదాపురం గూడూరు డివిజన్‌లోకి, వరికుంటపాడు, కొండాపురం జలదంకి, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, ఉదయగిరిని కావలి డివిజన్‌లోకి మార్చేలా ప్రతిపాదనలు చేశారు.


