News January 8, 2026
సర్వే మిషన్లపై పూర్తి అవగాహన ఉండాలి: కలెక్టర్ స్నేహ శబరీష్

భూమి కొలతల్లో ఖచ్చితత్వం కోసం అత్యాధునిక సర్వే మిషన్లపై లైసెన్స్‌డ్ సర్వేయర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ధర్మసాగర్, హసన్ పర్తి మండలాల సర్వేయర్లకు నిర్వహిస్తున్న శిక్షణను ఆమె పరిశీలించారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని, భూముల సర్వేలో ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన కొలతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 17, 2026
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. ఎక్కడుందంటే?

గుజరాత్‌లోని మాదాపర్ సుమారు ₹7,000 కోట్ల బ్యాంక్ డిపాజిట్లతో ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ 17కు పైగా బ్యాంక్ శాఖలు ఉండటం విశేషం. ఇక్కడి కుటుంబీకులు విదేశాల్లో స్థిరపడినా తమ సంపాదనను సొంత ఊరి బ్యాంకుల్లోనే పొదుపు చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. వీరి పొదుపు మంత్రం, పుట్టిన ఊరిపై ఉన్న మమకారం ప్రతి గ్రామానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.
News February 17, 2026
మొక్కజొన్నలో కత్తెర పురుగు కట్టడికి విషపు ఎర తయారీ విధానం

మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను మొక్క సుడిలో సాయంకాలం వేయాలి. దీని కోసం ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని 2-3 లీటర్ల నీటిలో కరిగించి తర్వాత తవుడులో కలిపి ఆ మిశ్రమాన్ని 24 గంటల పాటు పులియనిచ్చి, అరగంట ముందు ఈ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్బ్ మందును కలిపి విషపు ఎరను మొక్క సుడిలో వేయాలి.
News February 17, 2026
గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు షాక్: వైసీపీ

4 వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం వర్సిటీని సుప్రీంకోర్టు ఆదేశించిందని వైసీపీ ట్వీట్ చేసింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం రూ.118 కోట్ల బకాయిలు చెల్లించాలని.. లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీ చేసిందని అందులో పేర్కొంది. తమను ఈ బకాయిలు చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం బుకాయించినా.. వీబీసీ, గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదించిందంది.


