News April 25, 2024
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రొఫైల్

ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డిని అధిష్ఠానం ప్రకటించింది. వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకే రఘురామ్ రెడ్డి. మంత్రి పొంగులేటి, సినీ హీరో వెంకటేశ్‌కు ఆయన వియ్యంకుడు. గతేడాది పొంగులేటి కుమార్తెను రఘురాంరెడ్డి చిన్న కుమారుడికిచ్చి పెళ్లి చేయగా, పెద్ద కొడుక్కి నటుడు వెంకటేశ్ కుమార్తెతో వివాహమైంది. రఘురామ్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు.
Similar News
News January 12, 2026
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

తాను ఉండగా మరో మహిళతో కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగింది. బాధితురాలి వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన సాయిచరణ్‌కు 15ఏళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్లుగా భార్యను వదిలేసిన అతను కీసర అహ్మద్ గూడలో ఉంటున్నట్లు తెలుసుకున్న శిల్ప అక్కడికి చేరుకుంది. ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయటే కూర్చుంది. పోలీసులను ఆశ్రయించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
News January 12, 2026
వరంగల్ MGMలో ఖమ్మం జిల్లా వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లాకు చెందిన రవికుమార్(34) వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద శ్వాస ఇబ్బందితో కుప్పకూలారు. ఈనెల 9న జరిగిన ఈ ఘటనలో హోంగార్డ్ అమీన్ బాధితుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవికుమార్ ఆదివారం రాత్రి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల వివరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్సై తేజ కోరారు.
News January 12, 2026
ఖమ్మం: మున్సిపాలిటీల గెలుపుపై మంత్రుల ఫోకస్

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఏదులాపురంలో అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంలో ఒక్కో వార్డుకు ఐదుగురి చొప్పున జాబితా తయారీకి కసరత్తు సాగుతోంది.


