News January 8, 2026
వరంగల్: పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ సభల్లో 31 మందితో కూడిన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడుగా పి.మహేశ్, ప్రధాన కార్యదర్శిగా పొడపంగి నాగరాజు, కోశాధికారిగా డి.ప్రణయ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు.
Similar News
News February 7, 2026
వరంగల్: ఉపాధి పనులు ముమ్మరం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించి, కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం ఎంపీడీవోలు, ఏపీవోలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి పాల్గొన్నారు.
News February 7, 2026
వరంగల్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రస్తుత కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుండటంతో కొత్త వాటి కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార పౌరసంబంధాల శాఖ నిబంధనల మేరకు పకడ్బందీగా అక్రిడిటేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
News February 7, 2026
కేయూ దూర విద్య అడ్మిషన్ల నోటిఫికేషన్

కేయూ దూరవిద్య కేంద్రం పరిధిలో యూజీ, పీజీతో పాటు ఇతర కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను శుక్రవారం వీసీ ప్రొఫెసర్
ప్రతాపరెడ్డి విడుదల చేశారు. మార్చి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని డైరెక్టర్ సురేన్‌లాల్ తెలిపారు. ఇతర వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు. అలాగే ఈ నెల 17 నుంచి 27 వరకు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి 8.15 గంటల వరకు జూమ్ వేదికగా ఎన్ఐపీ ఆన్‌లైన్ సదస్సు నిర్వహించనున్నారు.


