News January 8, 2026
వేములవాడ: కన్నుల పండువగా.. వీనుల విందుగా..! ….

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీత్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల తొలిరోజు కార్యక్రమాలు కన్నుల పండువగా, వీనుల విందుగా సాగాయి. సాయంత్రం అనుపమ హరిబాబు బృందం శాస్త్రీయ సంగీత కచేరి, వి.జానకి బృందం శాస్త్రీయ సంగీతంతో సంగీతాభిమానులను అలరించారు. వి.నవ్యభారతి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా శివపార్వతి భాగవతారిణి హరికథ ఆకట్టుకుంది.
Similar News
News January 12, 2026
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఫ్లైట్ ఛార్జెస్

సంక్రాంతి పండగ వేళ ఊరెళ్లే వారికి విమాన ఛార్జీలు షాకిస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గన్నవరం, తిరుపతి వంటి ప్రాంతాలకు రూ.3 వేలుగా ఉండే టికెట్ 12, 13 తేదీల్లో ఏకంగా రూ.12 వేల వరకు ఉంటోంది. మళ్లీ 17, 18 తేదీల్లో AP నుంచి హైదరాబాద్ రావాలంటే ధరలు ఇలాగే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంక విశాఖ వెళ్లాలంటే సగటున టికెట్ ధర రూ.14 వేల వరకు ఉండటం ప్రయాణికులను కలవర పెడుతోంది.
News January 12, 2026
ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామస్థులు తరాలుగా సంక్రాంతి పండుగకు దూరంగా ఉంటున్నారు. పూర్వం పండుగ సరుకుల కోసం సంతకు వెళ్లిన వారు వరుసగా మరణించడంతో పండుగ చేసుకుంటే అనర్థం జరుగుతుందని గ్రామస్థుల నమ్మకం. అందుకే మూడు రోజుల పాటు ఇల్లు శుభ్రం చేయరు, ముగ్గులు వేయరు, కనీసం స్నానాలు కూడా చేయరట. పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ పండుగకు దూరంగా ఉండటం ఈ గ్రామస్థుల విశేషం.
News January 12, 2026
పౌరుషానికి మారుపేరు.. మన ‘అసిల్’!

అసిల్ అంటే అరబిక్‌లో ‘అచ్చమైన’ అని అర్థం. రాజసానికి, పోరాట పటిమకు నిలువుటద్దంగా నిలిచే ఈజాతి కోళ్లు గోదావరి జిల్లాల సంస్కృతిలో విడదీయలేని భాగం. ముఖ్యంగా భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో వీటిని ప్రాణప్రదంగా పెంచుతారు. గంభీరమైన నడక, దృఢమైన శరీరం అసిల్ పుంజుల ప్రత్యేకత. సంక్రాంతి సంబరాల్లో వీటి విన్యాసాలు పల్నాటి పౌరుషాన్ని తలపిస్తాయి. తరతరాలుగా గోదావరి గడ్డపై ఈజాతి తన ఉనికిని, వైభవాన్ని చాటుకుంటూనే ఉంది.


