News January 9, 2026
నిర్మల్: ఇంటర్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Similar News
News February 20, 2026
ఇవాళ కూడా నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 158పాయింట్లు కోల్పోయి 82,339 వద్ద, నిఫ్టీ 35పాయింట్లు నష్టపోయి 25,419 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, HCL టెక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న కూడా సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోవడంతో రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
News February 20, 2026
సంగారెడ్డి: 25 నుంచి EXAMS.. ఫోన్‌కు హాల్ టికెట్స్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు అధికారి గోవిందారం శుక్రవారం తెలిపారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ లింకులు పంపామని, వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపల్స్ వద్ద కూడా వీటిని తీసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News February 20, 2026
పెనుబల్లి: మిత్రుడి కోసం వచ్చి.. అనంతలోకాలకు!

మిత్రుడి దశదినకర్మకు హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏలూరు జిల్లా ఎండపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బర్రె వంశీ మృతి చెందారు. పెనుబల్లి వద్ద గురువారం బైక్ అదుపుతప్పి డ్రైనేజీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. సత్తుపల్లి డిపోలో పనిచేస్తున్న వంశీకి భార్య, ఏడాది కుమార్తె ఉన్నారు. స్నేహితుడిని కడసారి చూసేందుకు వచ్చి, తానూ విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.


