News April 25, 2024

కర్నూలు జిల్లాలో 180 నామినేషన్లు దాఖలు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లాలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రోజు నుంచి నేటి వరకు జిల్లాలోని పార్లమెంట్‌తో పాటు 8 నియోజకవర్గాలకు 180 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తెలిపారు. పాణ్యం, కర్నూలు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి 161 మంది అభ్యర్థులు 180 నామినేషన్ పత్రాలను అందజేశారన్నారు.

Similar News

News April 2, 2026

విద్యుత్ కాంతులతో కర్నూలు చారిత్రక కట్టడాలు

image

ఉభయ సభల్లో రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత‌ బిల్లు ఆమోదం పొందడంతో గురువారం సాయంకాలం కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆవరణలో సైతం కార్యాలయానికి అధికారులు ప్రత్యేక విద్యుత్ అలంకరణ చేశారు. జడ్పీ డిప్యూటీ సీఈవో ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులను వేసి సంబరాలు చేసుకున్నారు.

News April 2, 2026

కర్నూలులో ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు: జేసీ

image

జిల్లాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలపై దాడులు చేసి స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానాలు విధించాలని సూచించారు. నెలకు రెండుసార్లు దుకాణాల తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించానన్నారు.

News April 2, 2026

జిల్లాలో పశువులకు 5 జనరిక్ మందుల దుకాణాలు

image

జిల్లాలో పొట్టేలు, మేకలు, గొర్రెల అధిక సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఐదు ప్రాంతాల్లో జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు, హోలగుంద ప్రాంతాల్లో ప్రభుత్వ పశువైద్యశాలల వద్ద ఈ దుకాణాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నాలుగు దుకాణాలు సహకార సంఘాల ద్వారా, ఒకటి స్వయం సహాయక బృందం ద్వారా ఏర్పాటు చేయనున్నారు.