News January 9, 2026

OTTలోకి కొత్త సినిమాలు

image

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ ఈరోజు నుంచి Netflixలో 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అటు మురళీ మనోహర్ డైరెక్షన్‌లో నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘గుర్రం పాపిరెడ్డి’ ఈ నెల 16న ZEE5లోకి రానుంది. మరోవైపు శోభితా ధూళిపాళ్ల నటించిన ‘చీకటిలో’ సినిమా ఈ నెల 23న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. దీనికి శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.

Similar News

News January 25, 2026

ICC నిర్ణయాన్ని గౌరవిస్తాం.. సవాలు చేయబోం: బంగ్లాదేశ్

image

T20 WC నుంచి తమను ICC తొలగించడంపై బంగ్లాదేశ్ అధికారికంగా స్పందించింది. <<18948168>>బోర్డు నిర్ణయాన్ని<<>> గౌరవిస్తున్నట్లు తెలిపింది. ‘మేం మా వంతు ప్రయత్నించాం. మ్యాచుల వేదికలు మార్చలేమని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతా మా సొంత మార్గాల్లో ట్రై చేశాం. కానీ వాళ్లు సుముఖంగా లేకపోతే మేం మాత్రం ఏం చేయలేం. ఆ నిర్ణయాన్ని సవాలు చేయబోం’ అని BCB మీడియా కమిటీ ఛైర్మన్ అమ్జాద్ హుస్సేన్ చెప్పారు.

News January 25, 2026

నెయ్యితో సౌందర్య ప్రాప్తిరస్తు

image

నెయ్యి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు అందాన్ని పెంచడంలోనూ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. నెయ్యిలో ఉండే విటమిన్ A, ఫ్యాటీయాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు చర్మసౌందర్యాన్ని పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. నెయ్యిని స్నానం చేసే ముందు చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని కాంతిమంతం చేయడంతో పాటు ముఖంపై ఉండే ముడతలను కూడా తగ్గిస్తుంది.

News January 25, 2026

IMA డెహ్రాడూన్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA) డెహ్రాడూన్ 10 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, PhD, NET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianmilitaryacademy.nic.in/