News January 9, 2026

సిద్దిపేట జిల్లాలో పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

image

సిద్దిపేట జిల్లాలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్, గజ్వేల్ రూరల్ సీఐ పింగళి మహేందర్ రెడ్డి, చేర్యాల సీఐ శ్రీనును బదిలీ చేయగా, రైల్వేస్‌లో పని చేస్తున్న లక్ష్మీబాబు సిద్దిపేట త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేయగా, దండుగుల రవి రాజును గజ్వేల్ రూరల్ సీఐ, బానోతు రమేష్‌ను చేర్యాల సీఐగా బదిలీ చేశారు.

Similar News

News February 22, 2026

SKY టెక్నిక్ ప్రమాదకరం: సంజయ్ మంజ్రేకర్

image

T20WC: బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అనుసరిస్తున్న వ్యూహం ప్రమాదకరమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించారు. USAతో మ్యాచ్‌లో వికెట్లు కాపాడేందుకు SKY ఆచితూచి ఆడటం కలిసొచ్చినా అన్ని మ్యాచ్‌ల్లో అదే ఫాలో కావడం సరికాదన్నారు. 200+ టార్గెట్ స్కోర్ చేసే సమర్థత జట్టుకు ఉందని.. లోయర్ ఆర్డర్‌లోని హిట్టర్లకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. దూకుడుగా ఆడి భారీ స్కోర్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

News February 22, 2026

సకల దేవతా స్వరూపమే ‘గోమాత’

image

గోవు ప్రాణి మాత్రమే కాదు. ముక్కోటి దేవతల నిలయం. గోమాత శరీరంలోని ప్రతి భాగంలోనూ ఓ దేవత కొలువై ఉంటారు. ముఖం మధ్యలో శివుడు, కళ్లలో సూర్యచంద్రులు, చెవులలో అశ్వినీ దేవతలు, మెడ భాగంలో బ్రహ్మ, రాహు, కేతువులు, కాళ్లలో సరస్వతి, విష్ణుమూర్తి, విశ్వామిత్రుడు కొలువై ఉంటారు. ఉదరంలో భూమాత, తోకలో నాగరాజు, కొమ్ములలో ఇంద్రుడు నివసిస్తారు. అందుకే గోపూజ చేయడం వల్ల సకల దేవతలను ఆరాధించిన పుణ్యం లభిస్తుంది.

News February 22, 2026

సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

image

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్‌-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్‌ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.