News January 9, 2026

వీళ్లెవరండీ బాబూ.. స్పీడ్ బ్రేకర్లను ఎత్తుకెళ్లారు

image

MPలోని విదిశ(D)లో ఓ వింతైన దొంగతనం జరిగింది. ఇటీవల రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను దొంగలు రాత్రికి రాత్రే మాయం చేశారు. మెయిన్ రోడ్డు, దుర్గా నగర్ చౌక్, డిస్ట్రిక్ట్ కోర్టు, వివేకానంద చౌక్ మధ్య ప్రాంతాల నుంచి వీటిని ఎత్తుకెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే ఈ చోరీ జరగడంతో విమర్శలు వస్తున్నాయి. స్పీడ్ బ్రేకర్లే సురక్షితంగా లేకపోతే తమ భద్రత ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News February 3, 2026

రేపు ఢిల్లీలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

image

ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఉదయం ఢిల్లీలో NDA కీలక సమావేశం జరపనుంది. ఈ భేటీలో బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్@2047 విజన్, పార్లమెంటరీ అజెండాలపై చర్చించనున్నారు. FM నిర్మల బడ్జెట్ అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనుండగా, మోదీ MPలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీల ఎంపీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

News February 3, 2026

తెలుగువారి 52 ఏళ్ల ట్రైన్.. అరుదైన అవార్డు

image

హైదరాబాద్-విశాఖ మధ్య 52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2025కు గాను బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డు లభించింది. ‘1974 నుంచి ఇదొక ట్రైన్ కంటే ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది. ట్రైన్ నంబర్ 12728 సెలబ్రేషన్స్ గొప్పగా నిర్వహించాం’ అని SCR ట్వీట్ చేసింది. ఈ రైలుతో మీకున్న అనుబంధంపై కామెంట్ చేయండి.

News February 3, 2026

భారత్‌పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు శుభవార్త చెప్పారు. టారిఫ్‌లు 25% నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇవాళ PM మోదీతో మాట్లాడా. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. శక్తిమంతమైన నాయకుడు. రష్యన్ చమురు కొనుగోలును ఆపడానికి, US, వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది’ అని ట్రూత్‌లో పోస్టు చేశారు.