News January 9, 2026

అన్నమయ్య: 12 తర్వాత ఎప్పుడైనా సమ్మె

image

108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈనెల 12వ తేదీ తర్వాత ఏ క్షణమైన సమ్మెకు వెళ్తామని CITU జిల్లా గౌరవ అధ్యక్షుడు రామాంజులు, జిల్లా అధ్యక్షుడు రమణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బీవీ చలపతి తెలిపారు. 108 కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మదనపల్లెలోని కలెక్టర్ ఆఫీస్ ఎదుట గురువారం నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో మధుసూదన్‌కు సమ్మె నోటీస్ ఇచ్చారు.

Similar News

News February 22, 2026

SKY టెక్నిక్ ప్రమాదకరం: సంజయ్ మంజ్రేకర్

image

T20WC: బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అనుసరిస్తున్న వ్యూహం ప్రమాదకరమని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించారు. USAతో మ్యాచ్‌లో వికెట్లు కాపాడేందుకు SKY ఆచితూచి ఆడటం కలిసొచ్చినా అన్ని మ్యాచ్‌ల్లో అదే ఫాలో కావడం సరికాదన్నారు. 200+ టార్గెట్ స్కోర్ చేసే సమర్థత జట్టుకు ఉందని.. లోయర్ ఆర్డర్‌లోని హిట్టర్లకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. దూకుడుగా ఆడి భారీ స్కోర్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

News February 22, 2026

సకల దేవతా స్వరూపమే ‘గోమాత’

image

గోవు ప్రాణి మాత్రమే కాదు. ముక్కోటి దేవతల నిలయం. గోమాత శరీరంలోని ప్రతి భాగంలోనూ ఓ దేవత కొలువై ఉంటారు. ముఖం మధ్యలో శివుడు, కళ్లలో సూర్యచంద్రులు, చెవులలో అశ్వినీ దేవతలు, మెడ భాగంలో బ్రహ్మ, రాహు, కేతువులు, కాళ్లలో సరస్వతి, విష్ణుమూర్తి, విశ్వామిత్రుడు కొలువై ఉంటారు. ఉదరంలో భూమాత, తోకలో నాగరాజు, కొమ్ములలో ఇంద్రుడు నివసిస్తారు. అందుకే గోపూజ చేయడం వల్ల సకల దేవతలను ఆరాధించిన పుణ్యం లభిస్తుంది.

News February 22, 2026

సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

image

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్‌-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్‌ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.