News January 9, 2026

విమానాల తయారీలోకి అదానీ గ్రూప్

image

అదానీ గ్రూప్ విమానాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుంది. బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో రీజనల్ ప్యాసింజర్ జెట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ఏర్పాటు చేయనున్నారు. ఫిక్స్‌డ్‌ వింగ్‌ ప్యాసింజర్‌ విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్‌ యూనిట్‌ కానుంది. ఈ నెలాఖరున జరిగే ఏవియేషన్ షోలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Similar News

News February 18, 2026

పూజ పూర్తయ్యాక ఈ తప్పులు చేస్తున్నారా?

image

దైవానుగ్రహం కలగాలంటే పూజ సమయంలోనే కాదు, పూజ తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి. పూజ ముగిసిన వెంటనే కాళ్లు కడగకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. పూజ చేసిన రోజున మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. నైవేద్యాన్ని సమర్పించిన వెంటనే తీయకూడదు. కాసేపు అక్కడే ఉంచాలి. పూజలో, పూజానంతరం కోపతాపాలు మానాలి. ప్రశాంతంగా ఉంటే దైవశక్తి పెరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు మీ ఇంట్లో సానుకూలతను నింపుతాయి.

News February 18, 2026

BECILలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)లో 6 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech,డిప్లొమా, ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జూనియర్ ఇంజినీర్‌కు గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా, సూపర్‌వైజర్, MTSపోస్టుకు 45ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.becil.com

News February 18, 2026

వరిలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

image

వరి పైరులో గింజ పాలుపోసుకునే దశలో కంకి నల్లి ఆశిస్తుంది. వీటి వల్ల ఆకులపై పసుపు రంగు చారలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి నల్లగా మారతాయి. గింజలపై కూడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీనివల్ల గింజలు పాలు పోసుకోకుండా తాలుగా మారి పంట దిగుబడి 20-30% తగ్గే అవకాశం ఉంది. కంకినల్లి నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా స్పెరోమెసిఫిన్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో మందుమార్చి 2 సార్లు పిచికారీ చేయాలి.