News January 9, 2026

ఆసిఫాబాద్‌‌లో మున్సిపల్ అభ్యర్థుల వేట

image

జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోని 50 వార్డులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. రిజర్వేషన్లు ఖరారు కాకముందే ఆశావహుల బలాబలాలపై రహస్య సర్వేలు నిర్వహిస్తున్నాయి. బీసీ, జనరల్ రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని కులాల వారీగా ఒక్కో వార్డు నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లను సేకరిస్తున్నాయి. సామాజిక సమీకరణాలే గెలుపు గుర్రాలుగా భావిస్తూ అడుగులు వేస్తున్నాయి.

Similar News

News February 2, 2026

BREAKING: వరంగల్‌లో కిడ్నాప్ కలకలం

image

వరంగల్ కొత్తవాడలో సోమవారం సాయంత్రం ఓ బాలుడి(13)పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడ్డారని అతని తల్లి ఫిర్యాదు చేసింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని బాలుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మట్టెవాడ సీఐ కరణాకర్ తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 2, 2026

కృష్ణా: ‘విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలి’

image

పెనమలూరు నియోజకవర్గం పోరంకి BJR నగర్‌లోని చైతన్య విద్యా సంస్థల్లో పవన్ అనే విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన PGRSలో జిల్లా అధ్యక్షులు పూజిత, కార్యదర్శి సమరం కలెక్టర్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. తోటి విద్యార్థుల ముందు పవన్‌ను ప్రిన్సిపల్ అవమానకరంగా మాట్లాడినందుకు ఆత్మహత్య చేసుకున్నాడని SFI నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

News February 2, 2026

పోలీస్ శాఖ పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు: ఎస్పీ

image

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు. సోమవారం భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన పాల్గొని ప్రజల నుంచి 23 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలతో పాటు సైబర్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులపై ఫిర్యాదులు అందాయని తెలిపారు.