News January 9, 2026

సర్జరీ తర్వాత తిలక్ వర్మ ఫస్ట్ రియాక్షన్

image

యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ తన <<18802433>>హెల్త్ కండిషన్<<>> గురించి ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇచ్చారు. రాజ్‌కోట్‌లో సర్జరీ చేయించుకున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ‘మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను చాలా వేగంగా రికవర్ అవుతున్నాను. మీరు అనుకున్న దానికంటే ముందే గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తాను’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు HYD చేరుకుని తిలక్ రీహబిలిటేషన్ ప్రాసెస్ మొదలుపెట్టనున్నారు.

Similar News

News February 11, 2026

వందేమాతరం.. ఇకపై లేచి నిలబడాల్సిందే!

image

అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్‌ను పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒకే ఈవెంట్‌లో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. మొదట వందేమాతరమే పాడాలి. ఇది ప్లే అవుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి. సినిమాలు, డాక్యుమెంటరీ లేదా న్యూస్‌రీల్ మధ్యలో వందేమాతరం వస్తే మాత్రం థియేటర్‌లో నిలబడాల్సిన అవసరం లేదు.

News February 11, 2026

ఘోర ప్రమాదం.. ఆరుగురు యువకుల దుర్మరణం

image

రాజస్థాన్‌లోని జైపూర్-ఆగ్రా NHపై నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు మరణించారు. పెళ్లికి హాజరై తిరిగి కారులో వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టారు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులు సమయ్ (25), లోకేశ్ (24), దిల్‌కుష్ (24), మనీశ్ (23), అంకిత్ (26), నవీన్ (23)గా గుర్తించారు. వారంతా మంచి మిత్రులంటూ కలాఖో గ్రామస్థులు కన్నీరుపెట్టుకున్నారు.

News February 11, 2026

క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

image

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.