News January 9, 2026

ప్రభాస్ ‘రాజాసాబ్’ రివ్యూ&రేటింగ్

image

నానమ్మ కోరిక తీర్చేందుకు దుష్ట శక్తితో హీరో చేసే ప్రయాణమే ‘రాజాసాబ్’ స్టోరీ. ప్రభాస్ యాక్టింగ్, కామెడీ టైమింగ్‌ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. కానీ డైరెక్టర్ మారుతి మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే, స్లో ఫస్ట్ హాఫ్, అనవసరం అనిపించే సాంగ్స్, సీన్లు మైనస్. స్టోరీ టెల్లింగ్ వీక్‌గా ఉంది. ప్రేక్షకులు కనెక్ట్ కారు. కొన్నిచోట్ల బోర్ కొడుతుంది.
రేటింగ్: 2.25/5

Similar News

News February 2, 2026

నాని ‘ప్యారడైజ్’ విడుదల వాయిదా?

image

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ మూవీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో రిలీజ్ కావాల్సి ఉండగా ఈ మూవీ జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఏమైనా ఆలస్యం జరిగితే జులైలో రిలీజయ్యే అవకాశముందని వెల్లడించాయి. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం.

News February 2, 2026

నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో 47 పోస్టులు

image

బెంగళూరులోని<> CSIR<<>>-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 47 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్(BE, BTech), డిప్లొమా అర్హత గలవారు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీలకు FEB 10న, డిప్లొమా ట్రైనీలకు FEB11న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా ట్రైనీలకు రూ.10,900 చెల్లిస్తారు. సైట్: https://www.nal.res.in/

News February 2, 2026

రూ.20,000 తగ్గిన సిల్వర్ రేటు

image

వెండి ధరలు మరోసారి కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఒక్కరోజే కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.3,00,000 పలుకుతోంది. కాగా 4 రోజుల్లోనే వెండి ధర రూ.1.25 లక్షలు తగ్గడం గమనార్హం.