News January 9, 2026
17 నోటిఫికేషన్లు.. 20న హాల్‌టికెట్లు

AP: గత ఏడాది జారీ చేసిన 17 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల హాల్‌టికెట్లు ఈ నెల 20న విడుదల చేస్తామని APPSC వెల్లడించింది. https://psc.ap.gov.in/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం, రాజమండ్రిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని పేర్కొంది. నోటిఫికేషన్ల వివరాల కోసం పైన ఫొటోను స్వైప్ చేయండి.
Similar News
News February 21, 2026
సోమవారం నిర్వహించే ‘విశేష పూజ’

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం రెండో గంట తర్వాత విశేష సేవ జరుగుతుంది. 14 కలశాలతో మలయప్ప స్వామికి విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు. వీటిలో ఏడు కలశాలలో పాలు, పెరుగు, నెయ్యి వంటి ద్రవ్యాలు, మిగిలిన ఏడింటిలో శుద్ధజలం ఉంటాయి. పంచసూక్తాల పఠనం మధ్య తిరుమంజనం జరుగుతుంది. హోమం, పూర్ణాహుతి తర్వాత భక్తులకు వస్త్ర బహుమానం ఇస్తారు. 1991లో ప్రారంభమైన ఈ సేవ లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్నారు.
News February 21, 2026
‘ఎర్రనల్లి’తో పుచ్చకు కలిగే నష్టం, నివారణకు సూచనలు

‘ఎర్రనల్లి’ పురుగులు ఎరుపు రంగులో ఉంటూ ఆకుల కింది భాగంలో సాలెగూడు లాగా ఏర్పరచుకొని రసం పీల్చుతాయి. దీని వల్ల ఆకుల పైభాగంలో పసుపు, గోధుమ రంగు మచ్చలతో ఆకులు కాలిపోయినట్లు కనిపిస్తాయి. వీటిని రైతులు తొలి దశలో త్వరగా గుర్తించలేరు. అందుకే ఎర్రనల్లితో ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగుల నివారణకు అబామెక్టిన్ 0.5ml (లేదా) స్పైరోమెసిఫెన్ 1ml లీటరు నీటికి కలిపి ఆకుల కింది భాగం తడిచేలా పిచికారీ చేయాలి.
News February 21, 2026
349 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

UPSC 349 అసిస్టెంట్ కమాండెంట్స్(CAPF ఎగ్జామినేషన్ -2026) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు మార్చి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, PET, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జులై 19న రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://upsconline.nic.in


