News January 9, 2026

మంచిర్యాల: యాక్సిడెంట్.. డిగ్రీ విద్యార్థి మృతి

image

రంగారెడ్డి జిల్లాలోని <<18794592>>మోకిల <<>>వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌కు చెందిన విద్యార్థి దుర్మరణం చెందారు. మంచిర్యాలకు చెందిన దేవుళ్ల సూర్యతేజ HYDలో డిగ్రీ చదువుతున్నాడు. స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరుపుకొని కారులో తిరిగి వస్తుండగా బారికేడ్లను తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.

Similar News

News February 15, 2026

శివుడు తనలో సగ భాగాన్ని పార్వతికి ఎందుకు ఇచ్చాడు?

image

పార్వతీదేవి శివునిపై అచంచలమైన భక్తితో కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు, ఆమెను తనలో భాగంగా చేసుకున్నాడు. దీనివల్ల లోకానికి పురుషుడు (శివుడు – చైతన్యం), స్త్రీ (పార్వతి – శక్తి) వేర్వేరు కాదని ఈ రెండింటి కలయికతోనే సృష్టి నడుస్తుందని నిరూపించారు. ఇద్దరూ సమానమేనని, ఒకరు లేనిదే మరొకరు సంపూర్ణులు కారని ఈ రూపం చెబుతుంది. భక్తుడు భగవంతుడిలో లీనమవ్వడాన్ని కూడా ఇది సూచిస్తుంది.

News February 15, 2026

‘శివోహం జాగరణ’లో సీఎం: పటిష్ట భద్రత

image

మహాశివరాత్రి సందర్భంగా నంబూరు వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన ‘శివోహం జాగరణ’కు సీఎం హాజరయ్యారు. ఎస్పీ వకుల్ జిందల్, కలెక్టర్ తమీమ్ అన్సారియా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పటిష్ట నిఘా ఉంచారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

News February 15, 2026

బాపట్లలో పండగ పూట విషాదం

image

బాపట్లలో పండగపూడ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు కారుమూరి సతీష్ (35) విద్యుత్ షాక్‌తో మరణించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సతీష్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేస్తూ అందరికి సుపరిచితుడయ్యాడన్నారు. యువ నాయకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.