News January 9, 2026

కామారెడ్డి జిల్లాలో రాత్రి ACCIDENT

image

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లింగంపేట మండలం సూరాయిపల్లికి చెందిన కూలీలు వరినాట్లు వేసేందుకు ఆటోలో భిక్కనూర్ మండలం అంతంపల్లికి వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా జిల్లా కేంద్రంలో ముందున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News February 7, 2026

టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<>CCIO<<>>)లో 7 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.36,306 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://csio.res.in/

News February 7, 2026

రేపు పఠించాల్సిన సూర్య మంత్రాలు

image

సూర్యారాధనలో మంత్ర పఠనం అత్యంత శక్తిమంతంగా పని చేస్తుందని నమ్మకం. ‘ఓం సూర్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నో సూర్య ప్రచోదయాత్’ అనే సూర్య మంత్రం బుద్ధిని ప్రకాశింపజేసి, ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగిస్తుంది. ‘ఓం సూర్యాయ నమః’ అనే సూర్య అష్టాక్షరి మంత్రం కూడా చాలా ప్రభావవంతమైనది. సూర్యోదయం సమయంలో ఈ మంత్రాలను పఠిస్తూ అర్ఘ్యం వదిలితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరంలో కొత్త శక్తి ఉత్తేజితమవుతుంది.

News February 7, 2026

ప.గో: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని 8 మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 5, 6, 7, 8 తరగతులు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు అర్హులైన విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ శైలజ సూచించారు. పూర్తి వివరాలకు https://mjpapbcwreis.apiss.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు