News January 9, 2026

భద్రకాళి లేక్‌పై రోప్ వేకు అడుగులు!

image

WGLలోని భద్రకాళి లేక్‌పై రోప్ వే కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పీపీపీ పద్దతిలో 12 నెలల్లో నిర్మించి, 33 ఏళ్ల పాటు లీజు పద్దతిలో ఇవ్వడానికి ప్రతిపాదించింది. రోప్ వేను 1030 మీటర్ల దూరం నిర్మించనున్నారు. గ్లాస్ బ్రిడ్జి స్కైవాక్ 230 మీ.కు రూ.14.50 కోట్లు, రోప్ ద్వారా 800 మీ.కు రూ.65.54 కోట్లు.. మొత్తం రూ.77.04 కోట్లతో నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 45 రోజుల్లో ఫైనల్ చేసేలా రెడీ అవుతున్నారు.

Similar News

News February 17, 2026

బంగ్లా క్యాబినెట్‌లో ఏకైక హిందూ మంత్రి.. నితాయ్ రాయ్ చౌధరీ!

image

బంగ్లా కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్ మంత్రివర్గంలో హిందూ సామాజిక వర్గానికి చెందిన నితాయ్ రాయ్ చౌధరీకి స్థానం దక్కింది. ఆయన సాంస్కృతిక శాఖ బాధ్యతలు చేపట్టారు. మాగురా-2 నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన రాయ్ వృత్తిరీత్యా లాయర్. BNP వైస్ ఛైర్మన్లలో ఒకరు. 1990లో హుస్సేన్ ఎర్షద్ ప్రభుత్వంలోనూ మంత్రిగా చేశారు. హిందువులపై దాడుల నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయన చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

News February 17, 2026

శోభాయమానంగా ఏడుపాయల రథోత్సవం

image

ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రంలో రథోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. రథాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షణలో ఊరేగింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రమంతా సందడిగా మారింది. భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి కీర్తి ఎల్లలు దాటిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 17, 2026

పాకిస్థాన్‌కు ‘రావి’ షాక్: ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!

image

వేసవి వేళ పాక్‌కు భారత్ షాకివ్వనుంది. రావి నదిపై నిర్మిస్తున్న షాపూర్ కండి బ్యారేజ్ మార్చి 31 నాటికి పూర్తి కానుంది. దీంతో ఏప్రిల్ నుంచి పాక్‌కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపేయనున్నట్లు JK మంత్రి జావెద్ అహ్మద్ ప్రకటించారు. 1960 ఒప్పందం ప్రకారం ఈ నదిపై భారత్‌కే పూర్తి హక్కులు ఉన్నా ఇన్నాళ్లూ ప్రాజెక్టుల్లేక నీరు వృథాగా పాక్‌కు వెళ్లేది. ఇకపై ఆ నీటితో JK, పంజాబ్‌లకు సాగునీరు అందనుంది.