News January 9, 2026

కామారెడ్డి జిల్లాలో అత్యల్పానికి ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జుక్కల్ 8.1°C, మేనూర్ 9.1, లచ్చపేట 9.7, పెద్ద కొడప్గల్ 9.8, డోంగ్లి 9.9, బిచ్కుంద 10.1, పుల్కల్ 10.4, దోమకొండ 10.6, మాక్దూంపూర్ 10.7, మాచాపూర్, ఎల్పుగొండ, ఇసాయిపేట, నాగిరెడ్డిపేట 10.9, సర్వాపూర్ 11, కొల్లూరు 11.1, రామలక్ష్మణపల్లి, పిట్లం, బొమ్మన్ దేవిపల్లి 11.2°C ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 4, 2026

కోనసీమ: స్నేహితుడిని బీర్ సీసాతో పొడిచి చంపేశాడు..!

image

విజయవాడ రైల్వేస్టేషన్‌లో గుట్కా విక్రయాల విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాట్రేనికోనకు చెందిన సాయి (30)ని, అతని స్నేహితుడు నరగడ రాము మద్యం మత్తులో బీర్ సీసాతో పొడిచి చంపేశాడు. ప్లాట్‌ఫారమ్ 7-8 మధ్య జరిగిన ఈ దారుణాన్ని చూసి ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 4, 2026

ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం ‘సహస్రార చక్రం’

image

తల పైభాగంలో ఉండే ఈ చక్రం ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం. ఇది సమతుల్యంగా ఉంటే విశ్వంతో సంబంధం ఏర్పడి, అపారమైన జ్ఞానం, ఆనందం కలుగుతాయి. అస్థిరత ఏర్పడితే మానసిక ఒత్తిడి, జీవితంపై విరక్తి, ఒంటరితనం వేధిస్తాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి మౌన ధ్యానం శ్రేష్ఠమైనది. తల పైభాగంలో వెలుగు ఉన్నట్లు ఊహిస్తూ ధ్యానం చేయడం ఓంకారాన్ని పలకడం ద్వారా ఈ చక్రాన్ని సమతుల్యం చేయవచ్చు. ఇది మనిషిని దైవత్వానికి చేరువ చేస్తుంది.

News February 4, 2026

వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

image

కొన్నిచోట్ల వరి పంటలో మానిపండు తెగులు కనిపిస్తోంది. దీన్ని కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.