News January 9, 2026
మదనపల్లె: పురిటి బిడ్డను పారేసిన కసాయి తల్లి

మదనపల్లె పరిధిలోని బాలాజి నగర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పురిటి బిడ్డను తల్లి పారేసి వెళ్లిపోయింది. పసికందు కేకలు విన్న స్థానికులు కానిస్టేబుల్ మధుకర్‌కు సమాచారం ఇచ్చారు. పేగు కూడా ఊడని ఆ పసికందును ఎత్తుకుని చుట్టు పక్కల విచారించారు. బిడ్డను వదిలివెళ్లిన కసాయి తల్లి ఎవరన్నది తెలియరాలేదు. బిడ్డ చలికి విలపిస్తుంటే చూడలేక చలించిన ఓ అమ్మ మనసు ఆ బిడ్డను అక్కున చేర్చుకుంది.
Similar News
News January 13, 2026
నల్గొండ: ‘చిట్టిమల్లు’ రేపిన పల్నాటి యుద్ధం..!

పల్నాటి యుద్ధం.. తెలుగు వాళ్లకు పేరిన్నిక గల యుద్ధం. ఈయుద్ధానికి కారణం ఓ కోడి పుంజు అని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పుంజే చిట్టిమల్లు. ఒకప్పుడు పల్నాడులో రాజ్యాల మధ్య ఆధిపత్య, ఆక్రమణల కుట్రలు సాగాయి. నాయకురాలు నాగమ్మ కోడిపై గెలవడం కోసం బ్రహ్మనాయుడు మహిమ గల కోడి కోసం ఆరా తీస్తాడు. ఆనాడు శక్తిమంతమైన చిట్టిమల్లుగా పిలిచే పుంజును కుందూరు చోడుల రాజధానిగా ఉన్న మన NLG పానగల్లు నుంచే తీసుకెళ్లారు.
News January 13, 2026
నెలసరికి ముందు రొమ్ము నొప్పా?

నెలసరికి ముందు వక్షోజాల్లో నొప్పి, బరువుగా ఉన్నట్లు అనిపించడం లాంటి సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. దీన్ని ‘ప్రీ మెన్‌స్ట్రువల్ మాస్టాల్జియా’గా పిలుస్తారు. ఒక వయసు వచ్చాక అండం విడుదల సమయంలో వెలువడే ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఈ నొప్పికి కారణం. అయితే ఈ నొప్పి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణం ఏమో అని చాలా మంది భయపడతారు. కానీ అది అపోహే అంటున్నారు నిపుణులు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.
News January 13, 2026
మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు: సీతక్క

TG: గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరకు దాదాపు రూ.250 కోట్లు కేటాయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సారి జాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు భారీగా తరలివెళ్తున్నారు.


