News January 9, 2026
తిరుపతి: చిన్న అజాగ్రత్త.. ఒక ప్రాణాన్ని బలితీసుకుంది!

చంద్రగిరి(M) కందులవారిపల్లెలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీడీ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు అగ్గిపుల్ల మంచంపై పడటంతో మంటలు చెలరేగి, పాదిరి కేశవుల రెడ్డి అనే వృద్ధుడు గాయపడ్డారు. భార్య ఉన్నా ఆమె అనారోగ్యంతో మంచంపైనే ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. గ్రామస్థులు గమనించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించారు.
Similar News
News February 24, 2026
అనంతపురంలో పారిశ్రామికాభివృద్ధికి ఏపీఐఐసీ ముందడుగు

అనంతపురం జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం మూడు MSME పార్కులను అభివృద్ధి చేసినట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగ కుమార్ తెలిపారు. కూడేరు, తిమ్మసముద్రం, ఉరిచింతల గ్రామాల పరిధిలో 293 పారిశ్రామిక ప్లాట్లు కేటాయింపునకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 24, 2026
MLG: ఇంటర్ విద్యార్థులూ.. ఇవి తప్పక తెలుసుకోండి..!

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా అధికారి వీరేందర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ వాచ్, సెల్‌ఫోన్లు, కెమెరాలు ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకురావద్దన్నారు. కాగా పరీక్షా కేంద్రానికి సుమారు 200 మీటర్ల వరకు ఎలాంటి జిరాక్స్ షాపులు కూడా తెరిచి ఉంచవద్దన్నారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు.
News February 24, 2026
క్వింటా రూ.5,875: కార్యదర్శి జయలక్ష్మి

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు కార్యదర్శి ఆర్.జయలక్ష్మి తెలిపారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నుంచి క్వింటాలుకు రూ.5,875 మద్దతు ధరతో శనగలు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ-క్రాప్ నమోదు సర్టిఫికెట్, తేమ శాతం పరీక్ష కోసం నమూనా తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


