News January 9, 2026
విశాఖ జిల్లాలోకి గంజాయి తెస్తున్న మహిళలు

పాత గాజువాకలో అర్ధరాత్రి వేళ గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి పాతగాజువాక జంక్షన్ 38 బస్ స్టాప్ వద్ద ఏజెన్సీ నుంచి విశాఖకు 40 కేజీలు గంజాయి తీసుకువచ్చి దించుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గాజువాక పోలీసులకు వారిని అప్పగించారు
Similar News
News February 11, 2026
హుస్నాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

హుస్నాబాద్ మండలం తోటపల్లి క్రాస్ వద్ద జరిగిన మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో అజయ్(30) అనే యువకుడు మృతి చెందాడు. కరీంనగర్‌లో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న అజయ్.. స్వగ్రామం జనగామకు వెళ్తుండగా ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. బైక్ పూర్తిగా ధ్వంసం కాగా, తీవ్ర గాయాలైన అజయ్ వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 11, 2026
జగిత్యాల: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

జగిత్యాల జిల్లా పరిధిలో ఐదు మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎస్పీ వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు, భద్రతను పరిశీలించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
News February 11, 2026
నటుడి ఆవేదన.. సాయానికి ముందుకొస్తున్న సెలబ్రిటీలు

₹9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్‌పాల్ యాదవ్ <<19103948>>జైలులో సరెండరైన<<>> విషయం తెలిసిందే. ఆదుకునేందుకు ఎవరూ రాలేదంటూ వాపోయిన ఆయన కోసం సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. రాజ్‌పాల్‌కు తన చిత్రంలో అవకాశం ఇస్తానని సోనూ సూద్ తెలిపారు. తాను ₹1.1 కోట్లు ఇస్తానని GemTunes Music ఓనర్ రావ్ ఇంద్రిజిత్ సింగ్ ప్రకటించారు. నటుడు గుర్మీత్, పొలిటీషియన్ తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా సాయం చేస్తామని అన్నారు.


