News January 9, 2026
కొల్లాజెన్ ఎక్కువగా దొరికే ఆహారాలు

మన చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, జుట్టు మృదువుగా, ఉండాలన్నా కొల్లాజెన్ కీలకం. కొల్లాజెన్ కోసం సాల్మన్, ట్యూనా, సార్డినెస్ చేపలు, సిట్రస్ పండ్లు, బెర్రీలు, గుడ్లు, పాలకూర, కాలే, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో కొల్లాజెన్ దొరుకుతుంది. ధూమపానం, ఎండలో గడపడం, అధిక చక్కెరలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక ఒత్తిడి స్థాయులు కూడా శరీరంలో కొలాజెన్ క్షీణతకు కారణమవుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
Similar News
News February 19, 2026
TG EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 4 వరకు <
News February 19, 2026
రేపు యశ్ ‘టాక్సిక్’ టీజర్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రేపు ఉదయం 9.35 గంటలకు టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలో నటించారు. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న విడుదలవనుంది.
News February 19, 2026
మే తొలి వారంలో కవిత కొత్త పార్టీ!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకొని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని ఆమె పేర్కొన్నారు. మొదటి ఛాయిస్ సిద్దిపేట, రెండోది బోధన్ అని చెప్పారు.


