News April 25, 2024

ప్రియుడి కోసం యువతి వింత ప్రవర్తన.. వైద్యులు ఏం చెప్పారంటే?

image

కొంతమంది తమ ప్రియుడు/ప్రియురాలికి పదే పదే కాల్స్ చేసి విసిగిస్తుంటారు. చైనాకు చెందిన ఓ 18ఏళ్ల యువతి ఇటీవల తన ప్రియుడికి 100సార్లు కాల్ చేసింది. అతడు లిఫ్ట్ చేయకపోవడంతో వింతగా ప్రవర్తించింది. ఆమె బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. చిన్ననాటి నుంచి పేరెంట్స్‌తో సరైన అనుబంధం లేకపోవడమే దీనికి కారణమని, ఎమోషనల్ మేనేజ్‌మెంట్ టెక్నిక్‌తో సమస్యను పోగొట్టవచ్చని తెలిపారు.

Similar News

News February 7, 2026

ఆదిత్య హృదయంలో ఏం ఉంటుంది? ఎందుకు చదవాలి?

image

రామాయణంలో అగస్త్య మహర్షి రాముడికి ఉపదేశించిన స్తోత్రం ఆదిత్య హృదయం. దీన్ని ఆదివారం నాడు చదవడం ఫలప్రదం. ఇందులో 30 శ్లోకాలుంటాయి. మొదటి 14 శ్లోకాలు సూర్యుని ప్రశస్తిని, 15-21 ప్రార్థనను, 22-27 శుభ ఫలితాలను వివరిస్తాయి. ఈ స్తోత్ర పఠనంతో శత్రువులపై విజయం, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం, దారిద్ర్య విముక్తి లభిస్తాయి. మనశ్శాంతితో పాటు కోరిన కోరికలు నెరవేర్చే శక్తివంతమైన కవచంలా ఇది భక్తులను రక్షిస్తుంది.

News February 7, 2026

పేరెంటింగ్ పద్ధతి మారాలి

image

ప్రపంచం వేగంగా మారుతోంది. దానికి తగ్గట్లే పేరెంటింగ్ కూడా మారాలంటున్నారు సైకాలజిస్టులు. పిల్లల ప్రవర్తన మనకు కొత్తగా ఉండొచ్చు కానీ అది తప్పు కాదు. పాత తరానికి కొత్త తరానికి మధ్య ఉన్న గ్యాప్ అది. దాన్ని భర్తీ చేయడానికి, పిల్లలతో కనెక్ట్ కావడానికి పేరెంట్స్ ప్రయత్నించాలని చెబుతున్నారు. వారి ఫ్రీక్వెన్సీకి తగ్గట్లు ట్యూన్ అవ్వడానికి పేరెంట్స్ ప్రయత్నిస్తేనే వారిని అర్థం చేసుకోవడం వీలవుతుందంటున్నారు.

News February 7, 2026

ఇకపై విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బు జమ

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ కింద ఇప్పటివరకు ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లోకి నిధులు జమ చేసేది. ఇకపై పోస్టుమెట్రిక్ చదువుతున్న SC విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బు జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర వాటా ₹300Cr, రాష్ట్ర వాటా ₹200Crను స్టేట్ నోడల్ ఖాతాలో జమ చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే చెల్లింపులు చేస్తారు. త్వరలో ST విద్యార్థులకూ ఇలాగే జమ చేస్తారు.