News January 9, 2026
నల్గొండ: ఊసే లేని రూ.12 వేల ఆర్థిక సాయం!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. పథకాలు ప్రారంభించడమే తప్ప కాంగ్రెస్ అమలు చేయడం లేదంటూ సర్కార్ తీరుపై కూలీలు మండిపడుతున్నారు. భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజాపాలన గ్రామ సభల్లో NLG నుంచి 15,485, సూర్యాపేటలో 22,186, యాదాద్రిలో 11,551 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News January 12, 2026
సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్.. కారణమిదే!

స్టాక్ మార్కెట్ సూచీల్లో ఈరోజు భారీ బౌన్స్ బ్యాక్ కనిపించింది. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ఠం నుంచి ఏకంగా 1000 పాయింట్లు పుంజుకోవడం విశేషం. చివరకు ఈ సూచీ 301 పాయింట్లు లాభపడి 83,878 వద్ద ముగిసింది. నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 25,790 దగ్గర స్థిరపడింది. భారత్‌తో ట్రేడ్ డీల్‌పై అమెరికా నియమిత రాయబారి సెర్గియో గోర్ చేసిన సానుకూల వ్యాఖ్యలు సూచీలను పైకి లేపాయి. దీంతో 5 వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది.
News January 12, 2026
పేకాట-కోడిపందేలపై ఉక్కుపాదం: రామగుండం సీపీ

RGM కమిషనరేట్ పరిధిలో పేకాట, కోడిపందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై పటిష్ఠ నిఘా పెట్టామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు, నాకాబందీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సరిహద్దు జిల్లాల పోలీసులతో సమన్వయం కొనసాగుతోందన్నారు. అక్రమ కార్యకలాపాల సమాచారం డయల్-100 లేదా స్టేషన్‌కు ఇవ్వాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
News January 12, 2026
మృత్యువును ఆపిన ‘డెలివరీ’ బాయ్.. HYDలో సెల్యూట్

నిత్యం ట్రాఫిక్‌తో కుస్తీ పట్టే ఓ డెలివరీ బాయ్ మానవత్వంలో అందరికంటే ముందున్నాడు. ఆత్మహత్యకు సిద్ధపడిన ఓ మహిళ ఆర్డర్ చేసిన విషాన్ని డెలివరీ చేయకుండా ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాణాలు కాపాడాడు. నగరంలోని మీడియా జంక్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఉదంతం చర్చకు రాగా అక్కడి వారంతా లేచి నిలబడి ఆ యువకుడికి సెల్యూట్ చేశారు. ఈ ‘నిజమైన హీరో’ ఇప్పుడు హైదరాబాదీల ప్రశంసలు అందుకుంటున్నాడు.


