News January 9, 2026
మున్సిపల్ పోరు.. అందరి దృష్టి మంత్రి పొంగులేటి ఇలాఖాపైనే..!

ఏడు పంచాయతీల విలీనంతో 20 వార్డులు, 18,868 మంది ఓటర్లతో కల్లూరు మున్సిపాలిటీగా అవతరించింది. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం కావడంతో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రేపు ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల కానుండటంతో అభ్యర్థుల వేట మొదలైంది. భవిష్యత్‌లో కల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంగా మారుతుందనే ప్రచారం జరుగుతుండటంతో, ఇక్కడ పట్టు సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.
Similar News
News February 19, 2026
ధరణి వెనుక ‘పెద్ద’ కుట్ర.. డొంక కదిలింది: పొంగులేటి

ధరణి పోర్టల్ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల అసలు రంగు బయటపడుతోందని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. సచివాలయంలో ధరణిపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీతో ఆయన సమీక్షించారు. “తీగ లాగితే డొంక కదిలినట్లు” అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు. గత పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం పోర్టల్‌లోని లొసుగులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టారని ఆరోపించారు.
News February 18, 2026
ఖమ్మంలో సదరం శిబిరం ఏర్పాట్లపై ఆరా

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సదరం (SADAREM) బ్లాక్‌ను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. రాబోయే శిబిరం కోసం జరుగుతున్న సివిల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, శిబిరానికి వచ్చే దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News February 18, 2026
జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్‌కు 1.38 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేసి మార్చి 15లోపు పనులు ముగించాలని ఆదేశించారు. నాగపూర్- అమరావతి హైవే ప్యాకేజీలకు కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భూ స్వాధీనం వేగవంతం చేయాలన్నారు. 17 జంక్షన్ల రోడ్డు భద్రతా పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.


