News January 9, 2026

మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

image

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Similar News

News February 22, 2026

సభలోకి దేవుళ్ల ఫొటోలు ఎందుకు తీసుకెళ్లొద్దు?: భూమన

image

AP: దేవాలయాల్లాంటి అసెంబ్లీ, మండలిలోకి దేవుళ్ల ఫొటోలు ఎందుకు తీసుకెళ్లకూడదని TTD మాజీ ఛైర్మన్, YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నోసార్లు బూట్లు ధరించే దేవుడి ఫొటోలను పలువురికి కానుకగా ఇచ్చారని ఆరోపించారు. కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని అన్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలోకి శ్రీవారి ఫొటోలు తీసుకురావడంపై కూటమి నేతలు మండిపడిన సంగతి తెలిసిందే.

News February 22, 2026

ఓవర్సీస్ విద్యానిధి పథకం.. రేపటి నుంచి దరఖాస్తులు

image

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి (₹20L వరకు సాయం) పథకానికి దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు మార్చి 24 వరకు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 300 నుంచి 700కి పెంచింది. ఇందులో BCలకు 500, EBCలకు 200 చొప్పున కేటాయించారు. దరఖాస్తు, పూర్తి వివరాలకు <>telanganaepass.cgg.gov.in<<>> సైట్ చూడండి.

News February 22, 2026

కనకాంబరం సాగుకు అనువైన రకాలు

image

‘టిటియా ఎల్లో’ పసుపు రంగు పువ్వులు, ‘సెబకాలిస్ రెడ్’ ఎరుపు రంగు పువ్వులు, నారింజ రంగులో ‘లక్ష్మీ’ అధిక దిగుబడినిస్తాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ‘డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం’ రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైంది. IIHR అభివృద్ధి చేసిన రకాలు అర్కా అంబరా(నారింజ ఎరుపు), అర్కా చెన్నా(నారింజ), అన్న కనక(నారింజ), అర్కా శ్రావ్య(నారింజ ఎరుపు) రకాలు ఎక్కువ దిగుబడినిస్తాయి.